Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ చేతికి గాయమైనా .. వాళ్ల తాతగారిలానే లెక్క చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఆది' షూటింగులో ఎన్టీఆర్ చేతికి గాయమైంది 
  • అయినా షూటింగులో పాల్గొన్నాడు 
  • వాళ్ల తాతగారి లక్షణమే వచ్చిందని అనుకున్నాం    
ఎన్టీఆర్ .. వినాయక్ దర్శకత్వంలో చేసిన 'ఆది' సినిమాకి పనిచేసిన రోజులను గురించిన అనుభవాలను, 'పరుచూరి పలుకులు' ద్వారా పరుచూరి గోపాలకృష్ణ పంచుకున్నారు. 'ఆది' సినిమాకి మేం రాసిన డైలాగ్స్ వినాయక్ కి బాగా నచ్చాయి. ఈ సినిమా కోసం వినాయక్ ఎంతో కష్టపడ్డాడు. ఒక రోజున ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ను విశాఖపట్నంలో చిత్రీకరిస్తుండగా, తారక్ చేయి అద్దానికి తగిలి గాయమైందని చెప్పారు.

 షూటింగ్ ఆగిపోయిందా అని నేను కంగారుగా అడిగాను. 'లేదు సార్ చేసేస్తున్నాడు ..' అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు అన్నగారు గుర్తుకు వచ్చారు .. ఆయన మొండితనం ఈ పిల్లాడికి వచ్చేసిందని అర్థమైంది. 'సర్దార్ పాపారాయుడు' క్లైమాక్స్ లో ఆయన ఎడమచేయి దెబ్బతింది. దాంతో కుడి చేత్తోనే శత్రువుల కంఠాలు నులిమేస్తూ ఫైట్ చేశారాయన .. షూటింగ్ మాత్రం ఆగనీయలేదు. అదే లక్షణం తారక్ లో కనిపించడం ఆనందాన్ని కలిగించింది" అంటూ చెప్పుకొచ్చారు.        
ntr
paruchuri gopalakrishna

More Telugu News